ఫ్లై దుబాయ్ విమానంలో కలకలం చోటు చేసుకుంది. కాక్ పిట్ లో ఇద్దరు పైలట్స్ కొట్టుకోవటమే కాకుండా...విమానం నుంచి హైజాక్ సంకేతాలు పంపటంతో ఒక్కసారిగా అందరూ ఉలికిపాటుకు గురయ్యాయి. తొలుత అత్యవసర సమయాల్లో పంపే సంకేతం Squawk 7700 పంపారు. కొద్దిసేపటికే మళ్ళీ అక్రమ చొరబాటు..హైజాక్ కు ప్రయత్నాలు జరుగుతున్న తరహాలో 7500 కోడ్ ను ప్రసారం చేశారు. ఈ విమానంలో ఉన్న కో పైలట్ కత్తితో పైలట్ పై దాడికి దిగాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో కాక్ పిట్ రక్తంతో తడిచిపోయింది. దుబాయ్ నుంచి ఈ ఫ్లై దుబాయ్ విమానం ఇజ్రాయెల్ లోని అత్యంత కీలక నగరం అయిన టెల్ అవివ్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసింది. విమానం టేక్ అఫ్ అయిన కొద్ది సేపటికే ఈ సంకేతాలు రావటంతో ఇజ్రాయెల్ కూడా వెంటనే అప్రమత్తం అయింది. ఒక వైపు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న తరుణంలో చోటు చేసుకున్న ఘటన వెనక కారణాలు ఏంటి అన్న అంశంపై ఇప్పుడు విచారణ సాగుతోంది. అయితే 180 మంది ప్రయాణీకులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియా లోని టబుక్ లో ల్యాండ్ చేశారు.ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరిగిన సమయంలో విమానం అత్యంత వేగంగా అంటే వేల అడుగుల మేర సడన్ గా కిందకు దిగటంతో ఇందులోని ప్రయాణికులకు కొంత మందికి గాయాలు అయ్యాయి.

                                       అయితే బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఒక పైలట్ ఆత్మహత్య చేసుకోవటంతో పాటు విమానాన్ని కూల్చటానికి ప్రయత్నం చేసినట్లు చెపుతున్నారు. సిబ్బంది తో పాటు ప్రయాణికులు..మరో పైలట్ కలిసి దీన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఫ్లై దుబాయ్ నుంచి వచ్చిన అత్యవసర సందేశాల మేరకు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌లో భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా.. అత్యవసర కోడ్‌లు ఎందుకు ప్రసారమయ్యాయి, వాటి వెనుక అసలు కారణం ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. ఒమన్ కు చెందిన పైలట్ విమానాన్ని కూల్చే ఉగ్ర కుట్ర చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ దేశ మీడియా కూడా ఇదే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయం తేలాల్సి ఉంది.

Full View

Tags: