నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) దేశంలోనే అతి పెద్ద ఎక్స్ఛేంజ్. ముఖ్యంగా ట్రేడింగ్ వాల్యూమ్, మార్కెట్ టర్నోవర్ పరంగా ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీవో వివరాలు శుక్రవారం నాడు బహిర్గతం అయ్యాయి. ఐపీవో కోసం ఎన్ఎస్ఈ ధరల శ్రేణిని 1700 -1785 రూపాయలుగా నిర్ణయించారు. ఐపీవో ద్వారా సంస్థ మొత్తం మార్కెట్ నుంచి 22562 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఈ లెక్కన సంస్థ మార్కెట్ క్యాప్ 4 .42 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 17 న మొదలు అయ్యే ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 21 న ముగుస్తుంది. మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద ఈ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో దరఖాస్తుదారు కనీసం ఎనిమిది షేర్లకు దరఖాస్తు చేయాల్సింది ఉంటుంది. షేర్ ముఖ విలువ ఒక రూపాయి. ఎన్ఎస్ఈ షేర్లు సెప్టెంబర్ 24 న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
హ్యుండయ్ మోటార్ ఇండియా ఐపీవో నే దేశంలో అతి పెద్ద ఐపీవో గా నిలవనుంది. రిలయన్స్ జియో ఐపీవో వచ్చిన తర్వాత మాత్రం ఇది రెండవ స్థానానికి పరిమితం కానుంది. రిలయన్స్ జియో ఐపీవో దసరా..డీపావళి మధ్య వచ్చే అవకాశం ఉంది.