సైనా నెహ్వల్ కు కరోనా

Update: 2021-01-12 06:20 GMT

థాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీలో పాల్గొనటానికి రెడీఅవుతున్న సైనా నెహ్వల్ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మంగళవారం నుంచి థాయ్‌ల్యాండ్ ఓపెన్‌ సూపర్‌-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్‌ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్‌ ప్రణయ్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డాడు. జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్‌లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్‌ నెగిటివ్‌గా టెస్ట్ లు నిర్వహించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిల్యాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు.

అంతర్జాతీయ గ్రీన్ జోన్‌ క్వారంటైన్‌లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగిటివ్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌ కు ముందు తమ రాకెట్‌ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆడనున్నారు. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది.

Tags:    

Similar News