మార్కెట్ తగ్గినా 52 వారాల గరిష్ట స్థాయికి

Update: 2026-06-29 11:42 GMT

Full Viewస్టాక్ మార్కెట్ లో సోమవారం నాడు ప్రముఖ ఫార్మా కంపెనీ లారస్ లాబ్స్ షేర్స్ దూసుకెళ్లాయి. మార్కెట్ తగ్గుముఖం పట్టినా కూడా ఇతర ఫార్మా కంపెనీలతో పాటు లారస్ లాబ్స్ షేర్ దుమ్మురేపింది. ఏకంగా ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 1530 రూపాయలకు టచ్ అయ్యాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం నుంచి లాభాల్లోనే ఉన్న ఈ షేర్లు మార్కెట్ ముగిసే సమయానికి భారీ లాభాలను గడించాయి. సోమవారం నాడు 1530 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకొని మార్కెట్ ముగిసే సమయానికి 52 రూపాయల లాభంతో 1503 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. గత కొంత కాలంగా ఈ కంపెనీ షేర్ ధర పెరుగుతూ పోతోంది. ఇప్పుడు కొత్త గరిష్ట స్థాయికి చేరింది. కంపెనీ పెద్ద ఎత్తున కాంట్రాక్టు డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజషన్ (సిడీఎంఓ) విభాగంపై దృష్టి పెట్టడంతో మార్జిన్లు మరింత పెరుగుతాయి అనే అంచనాలు ఉన్నాయి.

                                దీంతో పాటు కంపెనీ నాన్ ఫార్మా విభాగాలు అయిన యానిమల్ హెల్త్, క్రాప్ సైన్స్ వంటి వాటిపై కూడా ఫోకస్ పెట్టనుంది. కంపెనీ సిడీఎంఓ బిజినెస్ విషయంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎంతో బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో లారస్ లాబ్స్ ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తం ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకోవటంతో పాటు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఉపయోగించనున్నారు. సోమవారం నాడు ఈ షేర్లు ఏకంగా 1500 రూపాయలపైన ముగిసినందున మరికొంత కాలం ఈ షేర్ల లో జోష్ కొనసాగవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. సోమవారం నాడు బిఎస్ఈ సెన్సెక్స్ మాత్రం పెద్ద ఎత్తున ఊగిసలాడి చివరకు 372 పాయింట్ల నష్టంతో 76728 పాయింట్ల వద్ద ముగిసింది.

Tags:    

Similar News