హైదరాబాద్ లో అయితే ప్రీమియం అపార్టుమెంట్ ధరలు రెండు కోట్ల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. గరిష్ట ధర అయితే 21 కోట్ల రూపాయల నుంచి 29 కోట్ల రూపాయల వరకు ఉంది. పలు సంస్థలు సంపన్నుల అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.ఏకంగా ఒక్కో ఫ్లోర్ లో ఒక్క ప్రీమియం అపార్ట్ మెంట్ మాత్రమే ఉండేలా కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతుంది అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెపుతున్నాయి. దేశ వ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే గత కొంత కాలంగా ప్రీమియం సెగ్మెంట్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఒక్క ప్రీమియం అపార్టుమెంట్ గరిష్ట ధర 29 కోట్ల రూపాయలు ఉంటే... అక్కడ మాత్రం ఒక్కో అపార్ట్ మెంట్ స్టార్టింగ్ ధరే వంద కోట్ల రూపాయలు. ఇది ఎక్కడో దుబాయ్ లో కాదు.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే గురుగ్రామ్ లోనే. ఇక్కడ అపార్ట్ మెంట్ కనీస ధర 100 కోట్ల రూపాయలు అయితే ... గరిష్టంగా ఇది 170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఫేజ్ 5 లో భాగంగా ది దాహాలియాస్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది డీఎల్ఎఫ్. ఇది 2024 లో మొదలైంది. ఇప్పటికే ఇందులోని అపార్ట్ మెంట్స్ లో అరవై శాతం మేర అమ్ముడయ్యాయి కూడా. కాకపోతే ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ లో ఒక పెంట్ హౌస్ ఇప్పుడు ఏకంగా 271 కోట్ల రూపాయలకు అమ్ముడు అవటం హాట్ టాపిక్ గా మారింది. ఇది మొత్తం 17 , 200 చదరపు అడుగుల్లో ఉంది. దేశంలోనే సింగిల్ యూనిట్ గా ఇదే అతి పెద్ద డీల్ అని చెపుతున్నారు. జాతీయ మీడియా లో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. మానవ్ సర్దానా అనే పారిశ్రామివేత్త ఈ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసినట్లు చెపుతున్నారు.