తమిళనాడు ఫలితాలపై నిజమైన అంచనాలు

Update: 2026-05-04 11:26 GMT

యాక్సిస్ మై ఇండియా. ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా వరకూ పక్కాగా అంచనాలు వెలువరించే సంస్థ. కొన్నిసార్లు ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు తప్పినా కూడా ఎక్కువ శాతం పక్కాగా వివరాలు అందిస్తూ దేశంలోనే విశ్వసనీయ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు..ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల విషయంలో అందరి దృష్టి ...ఎక్కువ ఫోకస్ ఉన్నదీ అంటే పశ్చిమ బెంగాల్...తమిళనాడు ఫలితాలపైనే అని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగిసిన తర్వాత యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే హీరో విజయ్ కు చెందిన టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు సాధించే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువరించింది. ఈ పార్టీకి 35 శాతం ఓట్ షేర్ దక్కుతుంది అని పేర్కొంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే దేశంలో ప్రముఖ ఛానెల్స్ తో పాటు మరి కొంత మంది అధికార డీఎంకే నే తిరిగి అధికారంలో వస్తాయని అంచనా వేశాయి.

                                  అందుకే ఎక్కువ మంది విజయ్ పార్టీ టీవీకే విజయం సాధిస్తుంది అని నమ్మలేదు. కానీ యాక్సిస్ మై ఇండియా చెప్పిందే ఇప్పుడు నిజం అయింది. ఎవరూ ఊహించని రీతిలో టీవీకే ఇప్పుడు తమిళనాడు లో దిగ్గజ పార్టీ లు అయిన అధికార డీఎంకే తో పాటు ఏఐఏడీఎంకె ను కూడా చావు దెబ్బ కొట్టి విజయ్ సంచలన విజయం నమోదు చేశాడు. దీంతో యాక్సిస్ మై ఇండియా తో పాటు ఈ సంస్థ ఎండీ ప్రదీప్ గుప్తా ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు అనే చెప్పాలి. 2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా యాక్సిస్ మై ఇండియా పక్కాగా అంచనాలు వెలువరించింది.

                             Full Viewముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో బిఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకుంటుంది అని..గ్రామీణ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని ప్రకటించింది. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ విషయంలో కూడా ఈ సంస్థ అంచనాలే నిజం అయ్యాయి. అయితే యాక్సిస్ మై ఇండియా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. దీనిపై మాత్రం ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ప్రదీప్ గుప్తా ఒక ఛానెల్ లో మాట్లాడుతూ విజయ్ గెలుపుపై తమ అంచనాలు చూసిన తర్వాత చాలా మంది నవ్వుకున్నారు అని..కానీ నిజం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చింది అన్నారు.

Tags:    

Similar News