హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పుడు రాజకీయం అంతా దళిత బంధు చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి ఈ అంశంపై అధికార టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'టీఆర్.ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ వ్యతిరేకం.. అందుకే ఆ పార్టీ నిర్ణయాలు అలాగే ఉంటాయి. దళిత బంధు విషయంలో రెండు పార్టీలు కపట నాటకం ఆడుతున్నాయి. బీజేపీకి బడుగు బలహీన వర్గాలు అంటే ఎప్పుడూ చిన్న చూపే. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలి. హుజురాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి ఆ రెండు పార్టీ లకు బుద్ధి చెప్పాలి.' అని పేర్కొన్నారు.