కెసిఆర్ మోడల్ నే ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి !

Update: 2026-06-30 09:15 GMT

ప్రాంతీయ పార్టీ స్టైల్ లో సీఎం నిర్ణయాలు

ప్రాంతీయ పార్టీల్లో అంతా అధినేత ఇష్ట ప్రకారమే సాగుతుంది. అది పార్టీ లో అయినా...ప్రభుత్వంలో అయినా. కానీ జాతీయ పార్టీల్లో చాలా వరకు ఆ పరిస్థితి ఉండదు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చం మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మోడల్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ని కూడా ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపిస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం మంగళవారం నాడు పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు 9000 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఈ ప్రకటన సారాంశం. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఫోటో లు మాత్రమే వేశారు. సీనియర్ మంత్రి...సీనియర్ నేత అయిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కు ఈ యాడ్ లో ఎక్కడా చోటు దక్కలేదు. ఒక్క తుమ్మల నాగేశ్వర్ రావు విషయంలోనే కాదు..గతంలో కూడా తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆయా శాఖ మంత్రులను పూర్తిగా విస్మరించి కేవలం సీఎం రేవంత్ రెడ్డి..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల ఫోటోల తోనే ప్రకటనలు ఇస్తున్నారు.

                                  Full Viewగతంలో అంటే బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యారు. ఆ మోడల్ నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రాంతీయ పార్టీ తరహాలో మంత్రులను విస్మరించి ప్రభుత్వం అంటే అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క ప్రకటనల విషయానికే పరిమితం కాలేదు అని...పలు కీలక శాఖల్లో నిర్ణయాలు అన్నీ కూడా బిఆర్ఎస్ హయాంలో సాగినట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయి అని కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఈ విషయంలో ఒకరిద్దరికి మినహాయింపులు ఉన్నాయి కానీ..పలు కీలక శాఖలు అన్నిటిలో ఇదే పరిస్థితి ఉంది అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. మరో వైపు పలు కీలక శాఖలకు సంబంధించి కూడా ప్రైవేట్ టీం లు పని చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం బలహీనంగా ఉండటం కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కి కలిసి వచ్చింది అని ..అందుకే గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చూపించని తరహాలో ఆయన దూకుడు చూపిస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. ఏ కాంగ్రెస్ సీఎం చేయని రీతిలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ తో కూడా సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. పైకి ఇది రాష్ట్రం కోసం...రాష్ట్రానికి నిధులు సాధించటం కోసం అని చెపుతున్నా కూడా అసలు ఎజెండా వేరే ఉంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది.

Tags:    

Similar News