దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు రాజకీయ కారణాలతోనే...లేక ఆరోపణలతోనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తుంటారు. అలాగని ప్రతిపక్ష నాయకుడు కోరారు అని చెప్పి రాజీనామాలు చేసే సీఎం లు కూడా ఎవరూ ఉండరు. కానీ తెలంగాణాలో మాత్రం ఇప్పుడు రివర్స్ రాజకీయం సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు సంచలన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కెసిఆర్ రాజీనామా చేయాలని.. దీని కోసం కాంగ్రెస్ శ్రేణులు దశల వారీగా కార్యక్రమాలు చెప్పట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతగా కెసిఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి చెప్పిన కారణాలు మాత్రం సహేతుకంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఈ వెయ్యి రోజుల్లో ప్రతిపక్ష నేత గా ఉన్న కెసిఆర్ ఈ కాలంలో వేతనంగానే కోటి ఇరవై లక్షల రూపాయల వరకు తీసుకున్నారు అని...ఆయనకు కల్పించిన భద్రతతో పాటు అన్ని ఖర్చులు కలుపుకుని ఈ వెయ్యి రోజుల కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కెసిఆర్ పై ప్రభుత్వం 22.40 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అయినా కూడా ఆయన ఈ వెయ్యి రోజుల్లో ఒక్క సారి కూడా ప్రజా సమస్యలపై మాట్లాడలేదు అని...ప్రజా సమస్యలపై బయటకు రాలేదు అన్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్న తనకు ...వెయ్యి రోజులుగా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కెసిఆర్ కు అసలు పోలిక ఎక్కడ ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల కోసం..రాష్ట్రంలో సమస్యల పై బయటకు రాని కెసిఆర్ కేవలం తమ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు వరసగా ఉద్యోగానికి రాకపోతే వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగిస్తారు అని...మరి వెయ్యి రోజులపాటు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందుతూ పని చేయని కెసిఆర్ రాజీనామా కోసం కాంగ్రెస్ శ్రేణులు పోరాడాలన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకుని మంత్రులు...కాంగ్రెస్ నేతలు అంతా కూడా ప్రతిపక్షం నేత కెసిఆర్ అసెంబ్లీ కి హాజరు కావాలని డిమాండ్ చేశారు.
అయినా కూడా కెసిఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద అసెంబ్లీకి కేవలం రెండు..మూడు సార్లు మాత్రమే వచ్చారు. అది కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో సభకు అలా వచ్చి ఇలా వెళ్లయిపోయిన సందర్భాలే ఎక్కువ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం అంతా వైఫల్యాల మయం అంటూ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు లు రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తుండంతో రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం లో బిఆర్ఎస్ నేతలపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో పదవులు అన్ని తమ సొంత మనుషులకు ఇచ్చుకుంటే తాము మాత్రం అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాము అని...తమ పాలనకు అసలు పోలిక ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న సమయంలో కెసిఆర్ ఎక్కువ భాగం ఫార్మ్ హౌస్ ప్రగతి భవన్ కు పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కెసిఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ వెయ్యి రోజులుగా కెసిఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితం అయిన