ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఉద్దేశించి చేసిన రాజకీయ స్కిట్ ఆ పార్టీ నేతలను సమస్యల్లోకి నెట్టినట్లు కన్పిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత మంది బిజెపి నేతలు అరెస్ట్ కాగా..తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. స్కిట్ తో సీఎం కెసీఆర్ ను అవమానించారనే కారణంతో ఇప్పటికే జిట్టా బాలక్రిష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా..ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.
తాజాగా ఇదే కేసులో బిజెపి నాయకురాలు రాణి రుద్రమ, గాయకుడు దరువు ఎల్లన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ కు సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు అందించినట్లు హయత్ నగర్ పోలీసుల తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అంటే జూన్ 2న అమరుల యాదిలో పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కిట్ నిర్వహించినట్లు టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.