తెలంగాణ ప్రభుత్వంలో ఆయనో కీలక మంత్రి. నిత్యం వివాదాలు ఆయన వెన్నంటే ఉంటాయి. ఆయనపై వచ్చే అవినీతి ఆరోపణలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఫస్ట్ టైం మంత్రి అయినా కూడా ఆయన టార్గెట్ లు చాలా పెద్దవే. డబ్బులు సంపాదన విషయంలో అయినా ...పదవుల విషయంలో కూడా. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి విషయానికి వస్తే ఆ మంత్రి ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అనే చర్చ రాకకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ అండదండలు ఉండటం కూడా ప్రధాన కారణం అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఆ మంత్రికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు తెరమీదకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో హవా చెలాయిస్తున్న ఆ మంత్రి గత కొంత కాలంగా మలయాళ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు అని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కావటానికి మలయాళ హీరోయిన్ అయినా కూడా తెలుగులో పలు సినిమాలు చేసింది...ఇంకా చేస్తూనే ఉంది.
తెలంగాణ కు చెందిన ఈ కీలక మంత్రి ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు...కాంగ్రెస్ నేతలకు ఈ విషయం తెలుసో లేదో కానీ...తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో పర్మినెంట్ అడ్డా ఏర్పాటు చేసుకుని ఇక్కడ రకరకాల వ్యవహారాలు నడిపిస్తున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కీలకం గా ఉన్న మంత్రి మలయాళ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం వెలుగు చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మందికి అడ్డగోలు సంపాదన వచ్చి పడుతుండంతో ఇలా కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొస్తున్నట్లు ఉన్నాయి అనే చర్చ సాగుతోంది.