జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ రాజకీయం పొలిటికల్ టర్న్

Update: 2021-09-22 04:49 GMT

జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానం లో ఓడిపోయిన మురళీ ముకుంద్ ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ మద్దతుదారులకు తెరాస ఎమ్మెల్యే ఎలా మద్ద తు ఇస్తారని కామెంట్ చేశారు. ఆయన ముఖ్యము గా జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను టార్గెట్ చేశారు.దీంతో ఈ వ్యవహారం రంజు గా మారింది. నిన్న హైకోర్టు లో ఒక ఆర్డర్ రాగా, సహకార శాఖ ట్రిబ్యునల్ లో మరో ఆర్డర్ వచ్చింది. సొసైటీ సెక్ర‌ట‌రీని పదవి నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణ్ణయాన్ని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది.

హైకోర్టు స్టే ఇచ్చిన‌ప్పుడు ఎలాంటి మీటింగ్ లు, నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఎవ‌రికీ లేద‌ని తెలిసి కూడా కోఆప‌రేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్, ప్రెసిడెంట్ ర‌వీంద్ర నాథ్ లు ముర‌ళీ ముకుంద్ ను సెక్ర‌ట‌రీ ప‌ద‌వి నుంచి ఎలా తొలగిస్తార‌నీ, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ఎందుకు పాటించ‌క‌పోవ‌డం నేర‌మ‌నీ, 17.09.21 నాడు రిజిస్ట్రార్, ప్రెసిడెంట్ లు తీసుకున్న నిర్ణ‌యం అంటే ముర‌ళీ ముకుంద్ ప‌ద‌విపై వేటు చెల్ల‌ద‌ని ట్రిబ్యున‌ల్ తీర్పునిచ్చింది. దీంతో సొసైటీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. 

Tags:    

Similar News