కేసులు పెట్టింది కబ్జాదారులు..మాఫియానే

Update: 2026-07-27 15:57 GMT

హైడ్రా విషయంలో తెలంగాణ హై కోర్టు సోమవారం నాడు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని తెలంగాణ సిఎస్ ను ఆదేశించింది. కోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన ద్వారా స్పందించారు. ఆయన అందులో పలు విషయాలను ప్రస్తావించారు. రంగనాథ్ ప్రకటన సారాంశం ఇలా ఉంది. రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నా..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా పని చేశా. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పు దోవ పట్టిస్తున్నారు. నిజం వైపు.. నిజాయితీగా.. నిర్భయంగా పని చేయడమే హైడ్రా ధైర్యం. ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడుతున్నాం. హైడ్రా రెండేళ్లలో కాపాడిన ఆస్తుల విలువ రూ.1.50 లక్షల కోట్లు.. (17 బిలియన్ డాలర్ల ) విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించాం. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం.

                                మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులను స్వాధీనం చేసుకున్నాం. వేల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాం. లోతుకుంట భూముల విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల భూమిని కొట్టేయాలని ప్రయత్నం.శాంతా శ్రీరామ్ రియల్ ఎస్టేట్ సంస్థపై హైడ్రా కమిషనర్ సంచలన ఆరోపణలు. పర్మిషన్లు లేకుండా 2,500 ఏళ్ల నాటి హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేశారని ఆరోపణ. వందల చెట్లను అనుమతులు లేకుండా ధ్వంసం చేశారని వ్యాఖ్యలు. Save the Rocks Society, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి చెందిన 120 ఎకరాల భూమిలోకి బిల్డర్ ఆక్రమణకు వచ్చారని ఆరోపణ. తనపై కంటెంప్ట్ కేసు వేయించారని ఏవీ రంగనాథ్ వ్యాఖ్యలు. తనపై ఉన్న 63 కంటెంప్ట్ కేసులపై ఏవీ రంగనాథ్ క్లారిటీ. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ కేసులు వేసింది బడా భూ కబ్జాదారులేనని ఆరోపణ.

                                   చెరువులు, ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్ల పరిరక్షణలో అడ్డుపడటమే నా తప్పా?. బతుకమ్మ కుంటను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్నాం. లోతుకుంటలో వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అడ్డుగా నిలిచాం. సామాన్యుల ప్లాట్లను కబ్జా చేసి కాంప్లెక్స్‌లు నిర్మించాలనుకున్న వారికి అడ్డుకట్ట.సింగరేణి కార్మికుల వేలాది ప్లాట్లను కాపాడేందుకు పోరాటం. క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు. వీరందరికీ నేను అడ్డుపడటమే నేను చేసిన తప్పు. 63 కంటెంప్ట్ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటా. న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా 100 శాతం ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తా. గతంలోనూ.. ప్రస్తుతం.. భవిష్యత్తులోనూ ప్రభుత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా అని వెల్లడించారు.

Tags:    

Similar News