బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. ‘ప్రియమైన కర్ణాటక...ద్వేషాన్ని తిరస్కరించండి’ అంటూ ఆ ట్వీట్ లో రాశారు. కవిత ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన ట్వీట్ కు సానుకూల స్పందన కంటే పెద్ద ఎత్తున ప్రతికూల వ్యాఖ్యలే రావటం విశేషం. అందులో మచ్చుకు కొన్ని...ముఖ్యమంత్రి సింహాసనం కోసం తెలుగు ప్రజల మధ్య ద్వేషం పెంచిన నాయకుడి కుమార్తె నుంచి ఈ ట్వీట్ అంటూ ఒక నెటిజెన్ స్పందించారు. అవును వాళ్ళు ద్వేషాన్ని తిరస్కరిస్తున్నారు..కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారు...నెక్స్ట్ తెలంగాణ ప్రజలు అవినీతి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతారు అంటూ మరొకరు స్పందించారు.
ఒక నెటిజెన్ అయితే ఓకే ఘీ అంటూ కామెంట్ చేశారు. నాకు 15 కేజీల నెయ్యి కావాలని అని ఒక వ్యక్తి పోస్ట్ పెడితే..మరొకరు నెయ్యి అనే వాళ్ళు న్యూస్ చూడటం లేదా...కోర్టు వాతలు పెట్టక కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు రా స్కాం అని ఒకరు కవిత కు మద్దదు గా నిలిచారు. మరో నెటిజెన్ కవితా ... మీ సూచనలు ఎవరూ పాటించరు..మీ అన్న తెలంగాణ కు వచ్చే వాళ్ళను పొలిటికల్ టూరిస్ట్ లు అంటూ కామెంట్ చేస్తున్నారు...మీరు దయచేసి కర్ణాటక వర్చ్యువల్ టూరిస్ట్ గా మారవద్దు అంటూ సూచించారు. అక్కాయ్ అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీ లాంటి లిక్కర్ వ్యాపారంలో కోట్ల రూపాయల అవినీతి చేసిన వారు చెప్పిన మాటలు పట్టించుకోరు లే అంటూ నెటిజన్స్ స్పందించారు. మరి కొంత మంది అయితే నేరుగా కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్పక ఈ డొంక తిరుగుడు ఎందుకు అంటూ విమర్శించారు.