ఎస్ఈసి నోటీసుల స్వీకరణకు ఆమోదం!

Update: 2026-02-01 06:40 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాయర్ నే దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ అదానీ పెట్టుకున్నారు. దేని కోసం అంటారా...అమెరికా లో నమోదు అయిన కేసు లో. భారత ప్రభుత్వం గత 14 నెలలుగా గౌతమ్ అదానీ కి నోటీసులు ఇవ్వటానికి వివిధ కారణాలు చూపెడుతూ రిజెక్ట్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసి ) కోర్టు ను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉద్దేశంతో అదానీ లు రివర్స్ గేర్ వేసినట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నుంచి లీగల్ నోటీసును స్వీకరించేందుకు గౌతమ్ అదానీ తో పాటు సాగర్ అదానీలు అంగీరించారు. ఈ మేరకు వీళ్ళ తరపున కోర్ట్ లో లాయర్లు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు సమాచారం వెలుగు చూసింది. అమెరికా లో నమోదు అయిన ఈ కేసులో ఇది ఇప్పుడు కీలక పరిణామంగా మారింది అనే చెప్పొచ్చు.

                                        మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ కేసులో తన రక్షణ కోసం, వాదనల కోసం వాల్ స్ట్రీట్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది రాబర్ట్ జియుఫ్రా జూనియర్‌ను గౌతమ్ అదానీ నియమించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివిధ కేసుల్లో కూడా ఆయన లాయర్ గా సేవలు అందించారు అని చెపుతున్నారు . సలివన్ అండ్ క్రోమ్వెల్ అనే ప్రముఖ లా ఫర్మ్‌కు సహ-చైర్మన్ అయిన రాబర్ట్ జియుఫ్రా జూనియర్, గౌతమ్ మరియు సాగర్ అదానీల తరఫున ఈ దావాను స్వీకరించేందుకు తాను ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫెడరల్ న్యాయమూర్తికి తెలిపారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో దాఖలైన ఒక పిటిషన్‌లో వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీని ప్రకారం గౌతమ్ అదానీ, సాగర్ అదానీల తరఫున అమెరికా ఆధారిత న్యాయవాదులు, నియంత్రణ సంస్థ లీగల్ పత్రాలను స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీనివల్ల ప్రతివాదులకు నోటీసులు ఎలా అందించాలనే విషయంపై న్యాయమూర్తి తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది అని నిపుణులు చెపుతున్నారు.

                                           ఈ సంయుక్త దరఖాస్తు సంబంధిత కోర్టు ఆమోదం కోసం సమర్పించారు. ఇది అమెరికా న్యాయ ప్రక్రియల్లో సాధారణగా అమలులో ఉండే విధానమే. ఇందుకు న్యాయమూర్తి ఆమోదం ఇస్తే ఈ సంయుక్త దరఖాస్తు తో ఎస్ఈసి వ్యవహారం ముందుకు సాగేందుకు మార్గం సుగమం అవుతుంది. దీని ప్రకారం అదానీలు తమ కేసును కొట్టివేయాలనే అభ్యర్థన చేసుకోవటాని... తమ రక్షణ వాదనలను విపించటానికి 90 రోజుల సమయం దక్కుతుంది. ఆ తర్వాత ఎస్ఈసి మరో 60 రోజులలో తమ ప్రతివాదనలు దాఖలు చేయవచ్చు. దీనికి అదానీలు మరో 45 రోజులలో తమ సమాధానాలు ఇవ్వటానికి ఛాన్స్ ఇస్తారు. అదానీ గ్రూప్ కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) భారత్ లో వివిధ ప్రాజెక్ట్ లు దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు, అధికారులకు ఏకంగా 2200 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు ఇచ్చారు అనే అభియోగాలు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను అప్పటిలోనే అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఇవి పూర్తి అవాస్తవం అని పేర్కొంది.

Full View

Tags:    

Similar News