కెసిఆర్ ఆ ప్రకటనకు...రెండు వేల నోట్ల ఉపసంహరణకు లింక్ ఉందా?!

Update: 2023-05-19 15:19 GMT

ప్రభుత్వం ఏదైనా అవి తీసుకునే నిర్ణయాల వెనక కచ్చితంగా రాజకీయ కారణాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఎందుకంటే పైకి ఏమి చెప్పినా కొన్నిసార్లు వాటి వెనక ఉన్న ఎజెండా అంత తొందరగా బయటపడదు. ఎందుకంటే వాటి నిర్ణయాలవెనక చాలా చాలా కథలు ఉంటాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. ఒక ప్రవేట్ సంభాషణలో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ తన సహచరులకు చెప్పారు...2024 ఎన్నికలకు సంబదించిన ఖర్చు అంతా తాను భరించటానికి సిద్ధం అని...అయితే ప్రతిపక్ష పార్టీల కూటమికి తనను చైర్మన్ చేయాలని కోరినట్లు రాజదీప్ ఒక వీడియోలో వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు ప్రతిపక్షాలు ఏ మేరకు ఒప్పుకుంటాయో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వార్త పెద్ద సంచలనంగా మారినా కూడా బిఆర్ఎస్ నేతలు ఎవరూ దీనిపై నోరువిప్పిన దాఖలాలు లేవు. రాజదీప్ సర్దేశాయ్ కామెంట్స్ పెద్ద సంచలనంగా మారాయి. రాజదీప్ సర్దేశాయ్ చెప్పినట్లు ఏ నేత అయినా ఎన్నికల ఖర్చు ..అది కూడా దేశం అంతటికి చేయటం అంటే అది కచ్చితంగా బ్లాక్ మనీ అవుతుంది తప్ప...వైట్ మనీ ఇవ్వటం సాధ్యం కాదు. అయితే తెలంగాణ సీఎం కెసిఆర్ దగ్గర అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అంటూ పలు పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.

                                         కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ వెనక రాజకీయ కోణాలే ఎక్కువ ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం తో పాటు పలు అంశాల్లో ఎక్కడ దొరుకుతారా అని కేంద్రంలోని బీజేపీ కెసిఆర్ పై ఒక కన్నేసి ఉంచింది. అయితే రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ ఎప్పటినుంచో ఉహిస్తున్నదే అయినా టైమింగ్ చూస్తే మాత్రం రాజకీయ కారణాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు కెసిఆర్ మహారాష్ట్ర పై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సహజంగా ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఉన్న వేగంగా స్పందించే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ దీనిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. ఈ వార్త పబ్లిష్ చేసే సమయానికి బిఆర్ఎస్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కెసిఆర్ సర్కారు ప్రధాని మోడీ కి పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసింది ఆర్ బీఐ అయినా...కేంద్రం ఆమోదం లేకుండా ఇది బయటకు రాదు అనే విషయం తెలిసిందే. మొత్తం మీద చూస్తే తాజా నిర్ణయంతో ఎక్కువగా దెబ్బ తినేది రాజకీయ పార్టీలు...బ్లాక్ మనీ ఉన్న పారిశ్రామిక వేత్తలు అనే చెపుతున్నారు.

Tags:    

Similar News