వంద కోట్ల గ్రాస్ కూడా కష్టమే!

Update: 2026-03-22 06:35 GMT

టాలీవుడ్ లో భారీ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ ఉగాదికి విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్ల వివరాలను ఎందుకు వెల్లడించటం లేదు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల, రాశీ ఖన్నాలు నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ప్రేక్షకులే కాదు...పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఇది ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ నడుస్తోంది. దీనికి అనుగుణంగానే అన్నట్లు ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్క రోజు కూడా ఈ సినిమా వసూళ్ల పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో చిత్ర ఫలితంపై నిర్మాణ సంస్థ కూడా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ గత సినిమా ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికప్పుడు ఓజీ వసూళ్లను వెల్లడించిన సంగతి తెలిసిందే.

                                        Full Viewపవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఓజీ నిలిచింది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అప్పటిలో అధికారికంగా వెల్లడించారు. కానీ ఈ సారి మాత్రం ఎంతో హైప్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం వసూళ్ల విషయాన్ని ఏ మాత్రం బహిర్గతం చేయటం లేదు. మార్చి 19 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. విచిత్రం ఏమిటి అంటే ఆదివారం నాడు కూడా హైదరాబాద్ లో చాలా థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. సినిమా ఫలితం ఏంటో ఇదే చెపుతుంది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ ఈ మూవీ వంద కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవటం కూడా కష్టమే అనే చర్చ సాగుతోంది. మార్చి 19 న విడుదల కావాల్సిన పాన్ ఇండియా సినిమా టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ముందుకు తెచ్చి ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. అయినా ఇప్పుడు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది అనే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News