దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వసూళ్ల విషయంలో ఈ సినిమా దుమ్మురేపింది. చిరంజీవి, వెంకటేష్, నయనతార లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జీ 5 లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ తదితర భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది అని జీ 5 అధికారికంగా వెల్లడించింది. మెగా విక్టరీ ఆఫ్ 2026 అంటూ ఒక లుక్ ను విడుదల చేసింది.
,