ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ తదుపరి షెడ్యూల్ జోర్డాన్ లో మొదలు కానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ వెల్లడించకపోయినా ఈ సినిమా కు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఈ పేరు ప్రచారంలో ఉంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు వెళుతూ ఎన్టీఆర్ ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇప్పుడు ఈ లుక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
.