ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ తర్వాత విడుదల అయిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇది పెండింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ చివరి సినిమా కూడా కావటంతో దీనిపై ఆయన ఫాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. మరో వైపు ఈ మూవీని తెరకెక్కించింది గబ్బర్ సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ కావటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఒక రేంజ్ కు పెరిగాయి. మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవటంతో ఘోరంగా విఫలం అయింది. ఈ మూవీ చివరకు వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కూడా సాధించలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెలుగు తో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల తో పాటు రాశీ ఖన్నా సందడి చేసింది. పార్తీబన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ మూవీ మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ ఒక మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు అని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.