నిడివి రెండు గంటల ఎనిమిది నిమిషాలే

Update: 2026-02-10 13:55 GMT

విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న సినిమా ఫంకీ. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా... సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కె వి తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఫంకీ మూవీ ఎంత సరదాగా సాగనుందో స్పష్టత ఇచ్చాయి అనే చెప్పాలి. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాలో కథ కంటే కూడా ప్రేక్షకులను రెండు గంటల పాటు నవ్వించటమే లక్ష్యంగా తెరకెక్కించినట్లు అధికారికంగా వెల్లడించింది. సెన్సార్ రిపోర్ట్ ప్రక్రారం ఈ సినిమా నిడివి రెండు గంటల ఎనిమిది నిమిషాలు మాత్రమే. ఫంకీ మూవీ ఫిబ్రవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

                                            Full Viewఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు మూవీ ఈ సంక్రాంతి బరిలో నిలిచి ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న హీరో విశ్వక్ సేన్ ఈ సినిమా విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కంటెంట్ చూస్తుంటే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News