విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు వైరల్

Update: 2026-02-26 15:11 GMT

విజయదేవరకొండ, రష్మిక మందన్న ల పెళ్లి గురువారం నాడు అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుక అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఉదయం పది గంటల పది నిమిషాలకు జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరగ్గా ...సాయంత్రం కర్ణాటకకు చెందిన కొడవ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి. గురువారం సాయంత్రం అటు విజయదేవరకొండ తో పాటు రష్మిక మందన్నలు కూడా తమ పెళ్లి ఫోటో లను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. అంతే ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకంక్షాలు వెల్లువెత్తాయి. విజయదేవరకొండ, రష్మిక పెళ్ళికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

                         హాయ్ మై లవ్స్ ...నా భర్త మిస్టర్ విజయదేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా అంటూ రష్మిక పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి. మన కళలు..లక్ష్యాలు గొప్పగా..పెద్దగా ఉండాలి అని రోజూ నాకు చెప్పిన వ్యక్తి. నా భావాలను ఎప్పుడు వ్యక్తపరిచినా కూడా ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి. స్నేహితులతో ప్రయాణం చేయటం ఎంత గొప్పగా ఉంటుందో నేర్పిన వ్యక్తి. నన్ను నమ్మండి నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను అని రష్మిక తన పోస్ట్ లో పేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాల ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంగా మారింది. అయితే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదు.

                                     Full Viewచివరకు ఎంగేజ్మెంట్ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వీళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటూ పలు మార్లు విదేశాల్లో హాలిడేస్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చేవి. 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం సినిమా దగ్గర నుంచి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా జంటగా నటించారు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా రణబలి. ఈ ఏడాదే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News