ఢిల్లీలో...తాడేపల్లిలో వైసీపీది అదే మాట

Update: 2026-04-01 14:32 GMT

Full View

ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు అమరావతి అవినీతి విషయంలో ఒకటే మాట. అమరావతిలో కాంట్రాక్టుల కేటాయింపు విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతి పెద్ద అవినీతికి అమరావతిని రాజధాని చేశారు అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చదరపు అడుగు నిర్మాణాలను 4000 రూపాయలతో పూర్తి చేస్తుంటే అదే అమరావతిలో చదరపు అడుగుకు 12000 రూపాయలు చెల్లిస్తున్నారు అని లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత ఎక్కువ రేట్ ఉండదు అన్నారు. ఈ డబ్బులు అన్ని ఎక్కడకు పోతున్నాయి అని ప్రశ్నించారు. ఢిల్లీ లో నాలుగు వేల రూపాయలతో అవుతున్న పని...ఎన్నో ఉచితంగా ఇస్తూ కూడా ఇంత ఎక్కువ రేట్ వెనక కారణం ఏంటో చెప్పాలన్నారు. బుధవారం నాడు తాడేపల్లి లో మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు.

                                ఎస్ఎఫ్ టి నిర్మాణ వ్యయం పన్నెండు నుంచి పధ్నాలుగు వేల రూపాయల వరకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు అని విమర్శించారు. ఈ దోపిడి ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది... ఈ రోజు చెప్పినట్లు మళ్లీ మళ్లీ ఆధారాలతో చెబుతాం. చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేయడం ఖాయం. తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం. భాద్యులను శిక్షిస్తాం. అన్నీ ప్రజల ముందు పెడతామని జగన్‌ ప్రకటించారు. చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లో ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చారో ఇప్పుడు కూడా వాళ్ళకే అడ్డగోలుగా రేట్లు పెంచి ఇచ్చారు అని జగన్ పలు లెక్కలు కూడా చెప్పారు మీడియా సమావేశంలో. ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్‌టీ, సివరేజ్‌ ఛార్జీల్లో మినహాయింపు, వంటివి ఉన్నా కూడా ఎస్‌ఎఫ్‌టీకి రూ.11 వేల నుంచి రూ.14 వేల ఖర్చు చూపిస్తున్నారు అంటే ఇది భయంకరమైన దోపిడి కాదా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News