వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇది నిష్పక్షపాతంగా...ఎవరివైపు మొగ్గుచూపకుండా ప్రజలకు కేవలం నిజాలు మాత్రమే చెపుతుంది అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుక వినిపించటమే తమ ద్యేయం అన్నారు. సామాన్య ప్రజలతో పాటు మహిళలు, రైతులు, కార్మికులు, సమాజంలో వెనకబడిన వివిధ వర్గాల గొంతుకగా ఉండటమే తమ లక్ష్యం అన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ ఫ్లాట్ ఫార్మ్ స్వతంత్రంగా ఉంటుంది అని తెలిపారు. డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ప్రారంభించిన తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానెల్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే తమ డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ పేరును వెల్లడిస్తామన్నారు.