ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ వ్యవహారం

Update: 2021-02-01 15:22 GMT

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రులపై నిమ్మగడ్డ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మంత్రులు ఇద్దరూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీటిని పరిశీలించిన స్పీకర్‌ తమ్మినేని ఎస్‌ఈసీపై చర్యలకు ఉపక్రమించారు. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రివిలైజ్‌ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు.

మంత్రుల ఫిర్యాదును పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవలని స్పీకర్‌ ఆదేశించారు. దీనిపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ చేపట్టనుంది. 'ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో మాపై మోపిన నిందారోపణలు మాకు తీవ్రమైన బాధను, మానసిక వేదనను కలిగించాయి. ఆ కలతతోనే ఆ లేఖ గురించి మీ దృష్టికి తెస్తున్నాం. లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్‌ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలుగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి' అని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News