సీఎం జగన్ తో పోస్కో ప్రతినిధుల భేటీ

Update: 2020-10-29 14:03 GMT

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ పోస్కో కంపెనీ ప్రతినిధులు గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్‌ వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

సహజవనరులపరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటును అందించటమేకాక పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News