రేషన్ వాహనాలపై ఫోటోలు..పార్టీ గుర్తులొద్దు

Update: 2021-01-31 11:44 GMT

ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవహారం కొత్త మలుపుతిరిగింది. రేషన్ సరఫరా చేసే వాహనాలపై పార్టీ గుర్తులు..ఫోటోలు ఉండకూడదని సూచించింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్ తోపాటు దివంగత రాజశేఖర్ రెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ సాధ్యం అవుతుందా? లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీ హైకోర్టు పార్టీలతో సంబంధం లేకుండా రేషన్ సరఫరాను కొనసాగించవచ్చని పేర్కొంది.

ఇంటింటికి రేషన్ పథకానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశిస్తూ... దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని ఎస్ఈసీని కలవాలని స్పష్టం చేసింది. ఐదు రోజుల్లో ఈ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News