దోపిడీకి పరాకాష్ట అంటున్న జెన్ కో వర్గాలు

కమలంపాడు పీఎస్ పీ ప్రాజెక్ట్ లో భారీ దోపిడీ

ప్రభుత్వ పెద్దల అండదండలే కారణం

గొట్టిపాటి రవికుమార్ పేరుకే విద్యుత్ శాఖ మంత్రి. కానీ ఆయన శాఖలో నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఎవరో. కొంత మంది సన్నిహితుల దగ్గర ఆయన కూడా తన చేతుల్లో ఏమీ లేదు అంతా పై నుంచి వచ్చే ఆదేశాలే అని చెపుతుంటారు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని కొంత మంది ..ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో అవినీతికి విద్యుత్ శాఖ ఇప్పుడు ఒక కీలక స్థానంగా మారింది అన్నది బహిరంగ రహస్యమే. మీడియా లో విద్యుత్ శాఖ అవినీతి మీద ఎన్ని వార్తలు వచ్చినా కూడా పట్టించుకునే వాళ్లే లేరు. ఈ సారి కూటమి ప్రభుత్వంలో దోపిడీ కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది అన్నది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చెపుతున్న మాట. మొదటి నుంచి చెపుతున్నట్లే అనంతపురం జిల్లాలోని యాడికి మండలం కమలపాడు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లో భారీ గోల్ మాల్ కు తెరతీశారు. తొలుత ఈ ప్రాజెక్ట్ వ్యయం జీఎస్టీ కాకుండా 5470 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇప్పుడు దీన్ని ఏకంగా 8161 కోట్ల రూపాయలకు పెంచారు. అసలు తొలుత వేసిన అంచనాల్లోనే 20 శాతం మేర అదనపు ప్రయోజనం పొందేలా స్కెచ్ వేసుకున్నారు అని...కానీ ఇప్పుడు ఈ అంచనా వ్యయాన్ని మరింత పెంచటంతో పాటు ఎక్సెస్ తో కలుపుకుని దీన్ని ఏకంగా 8161 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు.

                                            దీంతో ఈ ఒక్క ప్రాజెక్ట్ లోనే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల లాభం దక్కనుంది. అంత మేర ప్రజలపై భారం పడబోతోంది. ఈ పెంచిన వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంలో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు...అధికారులు కలిసి పంచుకోబోతున్నారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇలాంటి ప్రాజెక్టులు ఒకటి రెండు తెర మీదకు వస్తే చాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెన్ కో లాంటి సంస్థలు దివాళా తీయటం ఖాయం అని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. తాము అనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్ట్ కేటాయించేలా విద్యుత్ శాఖ పలు మార్లు ఈ టెండర్లను వాయిదాల మీద వాయిదాలు వేసి ఇప్పుడు అనుకున్న విధంగా పని పూర్తి చేసుకుంది. ఈ వ్యవహారం అంతా ఒక స్కెచ్ ప్రకారమే సాగింది అన్నది ప్రభుత్వంలో బహిరంగ రహస్యంగా మారింది.

                                    తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కమలాపాడు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 8161 .69 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాటు ఎల్ 1 బిడ్దర్ గా నిలిచిన ఎకో రెన్ కన్సార్టియం కు దీన్ని కేటాయిస్తూ కూడా జీవో 64 జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో ఏఎంఆర్ మరో కీలక భాగస్వామిగా ఉన్నా కూడా జీవో లో ఎక్కడా ఆ కంపెనీ పేరు ప్రస్తావించక పోవటం విశేషం. విచిత్రం ఏమిటి అంటే ఇటీవలే ఎకో రెన్ ప్రాజెక్ట్ అధినేత జీఎస్టి ఎగవేత కేసు లో అరెస్ట్ అయి జైలు కు కూడా వెళ్లారు. అలాంటి కంపెనీకి ప్రభుత్వం ఏ మాత్రం వెరపు లేకుండా ప్రాజెక్ట్ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి అది కూడా వేల కోట్ల రూపాయల మేర దోచిపెట్టేందుకు వీలుగా జీవో జారీ చేసింది అంటే ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా చేస్తుందో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అధికార వర్గాలFull View నుంచి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంపు తో పాటు ఎవరికి ఈ ప్రాజెక్ట్ కేటాయించింది తెలుపుతూ జీవో 64 ను ఆగస్ట్ 19 రాత్రే జారీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విద్యుత్ శాఖ నుంచి ఈ జీవో ను తీసివేయటం విశేషం. అంటే ఈ గోల్ మాల్ వ్యవహారం బయటపడకుండా ఇలా చేశారు అన్న మాట. శనివారం ఉదయం ఈ వార్త ఫైల్ చేసే ముందే జీవో ల వెబ్ సైట్ చెక్ చేస్తే ఈ జీవో లో ఒక్క నెంబర్ తప్ప మిగతా సబ్జెక్టు మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకో ఇలా.

Tags: