వైజాగ్ లో కీలక ఐఏఎస్ తనయుడి మైనింగ్ దందా !

Update: 2023-02-13 03:50 GMT

ఆయన తండ్రి ఐఏఎస్..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో కీలక స్థానంలో ఉన్నారు. చాలామంది ఐఏఎస్ పిల్లలు కూడా సివిల్స్ బాట పట్టడం...అందులో విజయం సాధించి ఇక్కడ కూడా రాజకీయాలు, సినిమాల తరహాలో వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.ఈ కీలక ఐఏఎస్ తనయుడు సివిల్స్ బాట పట్టాలని నిర్ణయించుకుని...అకస్మాత్తుగా అది వదిలేసి వైజాగ్ కేంద్రంగా మైనింగ్ దందాలోకి దిగారు. ఇది చాలామందిని విస్మనినికి గురి చేస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే ఐఏఎస్ అయ్యే దానికంటే మైనింగ్ వ్యాపారంలోనే ఎక్కువ ఆదాయం ఉంది అనుకున్నారేమో కానీ అయన ఆ ప్రయత్నం వదిలేసి ..ఇందులో ఇప్పుడు ఫుల్ బిజీ అయి పోయారు. అధికారంలో ఉన్న పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు..ఇతర కారణాలతో ఆయన ఇటు వైపు మళ్లారంటున్నారు.

                                కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ లు కొంతమంది బినామీలతో కలిసి వ్యాపారం చేయటం...వచ్చిన డబ్బు అంతా వాళ్ళతో కలిసి పెట్టుబడులు పెట్టడం ఎప్పటినుంచో ఉంది. ఎక్కడా వాళ్ళు పైకి కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం అయన నేరుగా కొడుకునే మైనింగ్ రంగంలోకి దింపటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏపీలోని కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు చెందిన అల్లుళ్ళు, సన్నిహిత బంధువులు వైజాగ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ తో పాటు రకరకాల వ్యాపారాల్లో బిజీ గా ఉన్నట్లు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇందుకు తెర వెనక లావాదేలు చాలా జరిగినా విషయం ఎప్పుడైనా బయటకు వస్తే మా అల్లుళ్ళు, కొడుకులు వ్యాపారం చేసుకూడదా అంటూ దీర్ఘాలు తెస్తున్న విషయం కూడా తెలిసిందే.

Tags:    

Similar News