గీతం ఆక్రమణల కూల్చివేత!

Update: 2020-10-24 05:18 GMT

ప్రభుత్వం అవి అక్రమ నిర్మాణాలు అంటోంది. గీతం మాత్రం నోటీసులు లేకుండా తెల్లవారు జామున వచ్చి కూల్చివేతలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తోంది. శనివారం ఉదయం నుంచే విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ దగ్గర కలకలం. గీతం యూనివర్శిటీ టీడీపీ నేతలకు చెందినది కావటంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరీ కూల్చివేతలు చేస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆక్రమణలను తొలగిస్తున్నామని చెబుతోంది.

విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్నట్లు గీతం యూనివర్సిటీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతున్నారు. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు.

Tags:    

Similar News