ఏపీకి చెందిన మంత్రి శంకరనారాయణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన నారా లోకేష్ ను ఎద్దు అని సంభోధించారు. ' అనంతపురంలో జిల్లాలోకి ఓ ఎద్దు వచ్చింది. ఆ ఎద్దుకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. పంటలు ఎన్ని రకాలో తెలియదు. అలాంటి వ్యక్తి సీఎం జగన్ ను విమర్శించటం హస్యాస్పదం. లోకేష్ పరామర్శయాత్ర అంతర్యం అందరికీ తెలుసు. చేజారిపోతున్న నేతల బుజ్జగింపే లోకేష్ పర్యటన ప్రదాన ఉద్దేశం. మహానేత అడుగుజాడల్లో పయనిస్తూ రైతు సంక్షేమమే దేశ అభివృద్ధి అని నమ్మి రైతు శ్రేయస్సు కొరకు పాటుపడుతోంది జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
రైతులను ఆదుకోవాలి
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంటలు చేతికి అందాల్సిన సమయంలో భారీ వర్షాలు దెబ్బతీశాయన్నారు. పొలాల్లోనే కుళ్ళిపోయిన వేరుశెనగ పంట చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. రైతులను అవమానించే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదన్నారు. ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలి. రూ.2 వేల కోట్లు వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగింది. ఇప్పటివరకు కేవలం రూ.25 లక్షలు మాత్రమే నష్ట పరిహారం ఇచ్చారు. 15 నెలలుగా ఇన్‌పుట్ సబ్సిడీ.. డ్రిప్ ఇరిగేషన్.. ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.