ఎస్ఈసీకి హైకోర్టు షాక్..పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ చెల్లదు

Update: 2021-02-07 06:50 GMT

మంత్రి మీడియాతో మాట్లాడొద్దు

కీలక పరిణామం. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21 వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దని..మీడియాతో కూడా మాట్లానివ్వొద్దని డీజీపీని ఆదేశిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. అయితే హైకోర్టు ఎస్ఈసీ ఆదేశాలను తోసిపుచ్చింది. అయితే మీడియాతో మాట్లాడొద్దు అనే ఎస్ఈసీ ఆదేశాలు మాత్రం అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది.

ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రోటోకాల్ ప్రకారం తాను రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి ఉందని..ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఎస్ఈసీ కూడా రాష్ట్రపతి పర్యటన, ఇతర విధులకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అయితే మంత్రి మీడియాతో మాట్లాడవద్దనే ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News