షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..ఎస్ఈసీ

Update: 2021-01-21 08:38 GMT

వ్యాక్సిన్ ప్రక్రియతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమే అని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇప్పటికే ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్ళే ఆలోచనలో ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News