అప్పుల్లో ప్రభుత్వం..మంత్రులు మాత్రం...!

Update: 2025-03-19 05:49 GMT
అప్పుల్లో ప్రభుత్వం..మంత్రులు మాత్రం...!
  • whatsapp icon

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో కొలువుతీరి ఇంకా నిండా ఏడాది కూడా కూడా కాలేదు. కానీ ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన మంత్రి ఒకరు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఏ మంత్రి..ఏ రాజకీయ నేత కూడా నేరుగా వీటిని తన పేరు మీద పెట్టుకోరు అనే విషయం తెలిసిందే. తన అక్రమ సంపాదన అంతా ఎక్కడైతే పార్క్ చేస్తున్నాడో అక్కడి వాళ్ళతో నే ఈ స్పెషల్ ఫ్లైట్ ను కొనుగోలు చేయించినట్లు చెపుతున్నారు. ఆ మంత్రి రేంజ్ ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా పర్యటనలకు ఉపయోగిస్తున్న స్పెషల్ ఫ్లైట్ సౌకర్యాలకు, రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా తన ఫ్లైట్ కూడా ఉండాలని ఆదేశించారు అంట. అంతే లింగా గా పిలవబడే సదరు పవర్ బ్రోకర్ దీనికి అనుగుణంగానే సదరు మంత్రి కోసం ఈ స్పెషల్ ఫ్లైట్ ను సిద్ధం చేసినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతోంది.

                                                          కొద్ది సంవత్సరాల క్రితం ఇంచుమించు దివాళా స్థితికి చేరిన ఈ పవర్ బ్రోకర్ ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు కీలక పార్టీల అండదండలతో పెద్ద ఎత్తున సంపాదించారు అని...ఒక కీలక పార్టీ తమ అక్రమ సంపాదన మొత్తాన్ని అతడి ద్వారానే విద్యుత్ రంగంతో పాటు వివిధ ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడులు పెడుతున్నారు అని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఆ మంత్రి అక్రమ సంపాదనతో పాటు తన కోసం కొనుగోలు చేసిన స్పెషల్ ఫ్లైట్ ను కూడా అక్కడే పార్క్ చేశారు అని చెపుతున్నారు. 14 సీట్ల స్పెషల్ ఫ్లైట్ కనీస ధర 150 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెపుతున్నారు.

                                             అయితే ఈ ధర వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మంత్రి కోసం కొనుగోలు చేసిన స్పెషల్ ఫ్లైట్ ధర ఎంత అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. గతంలో ఈ పవర్ బ్రోకర్ ఎంతో మంది నమ్మిన వాళ్ళను ముంచిన చరిత్ర ఉన్నా కూడా సదరు పవర్ ఫుల్ మంత్రి మాత్రం తనకు ఆ పరిస్థితి ఎదురుకాదు అనే ధీమాతో ఉండంతో పాటు తన తరపున అన్ని డీల్స్ చేసే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు.

                                          ఇది చూసుకునే ఆయన ఇప్పుడు ఎవరిని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక వైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది...ప్రభుత్వం సమస్యల్లో ఉంది అని చెపుతున్నా కూడా ఏకంగా ఒక మంత్రి ఏడాది కూడా పూర్తి కాకముందే స్పెషల్ ఫ్లైట్ కొనే స్థాయికి వెళ్లిపోయారు అంటే వాళ్ళ సంపాదన ఏ రేంజ్ లో ఉందే ఊహించుకోవచ్చు అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. అయితే ఆ మంత్రి ఇప్పుడు ఇలాంటివి నాలుగైదు కొనగలరు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News