ప్లానింగ్ కమిటీ ఏర్పాటు

Update: 2026-03-17 14:56 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెర్టిపోర్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (ఏఏఎం) కోసం ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఎండీ నేతృత్వంలో ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. రెగ్యులర్ విమానాలు టేకాఫ్ కావాలంటే పెద్ద పెద్ద రన్ వే లు అవసరం అవుతాయి అనే విషయం తెలిసిందే. ఎయిర్ టాక్సీ ల నిర్వహణకు వెర్టిపోర్ట్స్ ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన ప్రాంతం నుంచే అవి నిటారుగా టేకాఫ్ కావటంతో అలాగే ల్యాండ్ అవుతాయి. వీటికి ల్యాండింగ్ ప్యాడ్స్ తో పాటు ప్యాసింజర్ టెర్మినల్స్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అయితే భారీ భారీ బిల్డింగ్ ల మీద వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కీలక నగరాల్లో వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవటనికి...కార్గో రవాణాకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వెర్టిపోర్ట్స్ ప్లానింగ్ కమిటీ కి ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఎండీనే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించారు.

                                      Full Viewఇందులో ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ , ప్రైవేట్ రంగానికి చెందిన ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఎలక్ట్రికల్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈ విటిఓఎల్) ఎయిర్ క్రాఫ్ట్ లకు అవసరం అయిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పై దృష్టి సారించటమే. భూమిపై, రూఫ్ టాప్స్ పై వెర్టిపోర్ట్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అని జీవో లో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న హెలిపోర్ట్స్ ను వెర్టిపోర్ట్స్ గా మార్చటానికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని జీవోలో పేర్కొన్నారు. డీజీసీఏ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ డిజైన్.. భద్రత తదితర అంశాల విషయంలో కఠిన నిబంధనలు పాటించేలా చూడాలన్నారు.

Tags:    

Similar News