ఇసుకపై చేతులెత్తేసిన ఏపీ సర్కారు!

Update: 2020-11-05 14:57 GMT

కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీలో ఇసుక అమ్ముతాయా?

ప్రైవేట్ చేతికి అప్పగించేందుకే?!

ఏపీలో ప్రస్తుతం ఇసుక సరఫరా వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపీఎండీసీ) చూస్తోంది. కానీ సర్కారు ఇప్పుడు ఎపీఎండీసీని కాదని కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తుంది అంట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి ఏపీలో ఇసుక అమ్ముతాయా? అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇసుక సరఫరా చేయటం కూడా చేతకాదని సర్కారు చెప్పదలచుకుందా?. అత్యుత్తమ విధానం..అత్యంత పారదర్శకంగా అంటూ ఊదరగొట్టి ఇఫ్పుడు మళ్లీ మార్పులు చేశారు. ఇసుక సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ పెడుతున్నాం..అసలు అక్రమాలకు ఛాన్సే ఉండదన్నారు.. కానీ చాలా చోట్ల అక్రమాలే జరిగాయి. అంతే కాదు...అత్యుత్తమ విధానం తీసుకొస్తామని ఓ ఆరు నెలలు పాటు రాష్ట్రంలో ఇసుక సరఫరా లేకుండా ఆపేశారు. ఆ సమయంలో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు నానా కష్టాలు పడ్డారు.

ప్రత్యేక సాఫ్ట్ వేర్ డెవలప్ చేసి ఇసుక కోరుకున్న వారికి కోరుకుంటున్నట్లు సరఫరా చేస్తామని ఎన్నో మాటలు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు అని ఇసుక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేదంటే అత్యంత పారదర్శకంగా టెండర్ పిలిచి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారంట. దీనికి మరింత మెరుగైన ఇసుక విధానం అని సర్కారు ఓ పేరు పెట్టింది. అంటే ఇఫ్పుడు వరకూ చేసింది బాగాలేదని ఒప్పుకున్నట్లేగా. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండవ ఏడాది నడుస్తున్నా కూడా ఇసుక సరఫరాకు సంబంధించి అక్రమాలు అలా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

Tags:    

Similar News