బడ్జెట్ సమావేశాలు...రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగం

Update: 2021-05-20 07:05 GMT

కరోనా తో  ఆర్ధిక రంగంపై ప్రభావం

శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం సంప్రదాయం. అయితే కరోనా తెచ్చిన సమస్యల వల్ల ఇందులోనూ మార్పు వచ్చింది. తొలిసారి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రాజ్ భవన్ నుంచే వర్చువల్ ద్వారా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి ప్రసంగించటం ఇదే మొదటిసారి. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు కూడా చాలా విశేషాలు ఉన్నారు. ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టి..అదే రోజు దీన్ని ఆమోదింపచేసుకోనున్నారు. ఇది కూడా ఓ రికార్డే. కరోనా కేసుల ఎక్కువగా ఉన్నాయనే కారణంతో ఏపీ సర్కారు మార్చిలో జరపాల్సిన సమావేశాలను జరపకుండా..ఆర్డినెన్స్ ద్వారా మూడు నెలల కాలానికి బడ్జెట్ ఆమోదింపచేసుకుంది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదం కోసం గురువారం నాడు ఒక రోజు సమావేశం తలపెట్టింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ..దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉందన్నారు. వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొవిడ్‌ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని కొవిడ్‌ చికిత్సలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గవర్నర్‌ తెలిపారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ ను ఆయన అభినందించారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని.. అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. నాడు-నేడు, వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్‌ వివరించారు.

Tags:    

Similar News