దీపం పథకానికి డుమ్మా కొట్టి మరి కాకినాడ లో ఏమి చేస్తున్నట్లో?!

Update: 2024-11-03 05:40 GMT

మూడు రోజులు కాకినాడలో మకాం వెనక మతలబు ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు దీపం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డీపావళి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ కీలక హామీ అమలులో భాగస్వాములు అయ్యారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ సర్కారులో అత్యంత కీలకమైన ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. పోనీ ఇంతకంటే ముఖ్యమైన పనిలో ఏమైనా ఉన్నారా అంటే మూడు రోజులు కాకినాడ లో మకాం వేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పైగా ఆయన కాకినాడ పోర్ట్ ను సందర్శించటం... కాకినాడ లోని కీలక రైస్ మిల్లర్స్ తో విందు సమావేశం నిర్వహించటం హాట్ టాపిక్ గా మారింది.

                                                                                   మంత్రి కి చెందిన సమీప బంధువులు కూడా ఈ వ్యాపారంలో కీలకంగా ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడినట్లు చెపుతున్నాయి. గతం లో కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం పోర్ట్ ద్వారా అక్రమ రవాణా అయ్యేవి అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. కొద్ది రోజులుగా క్రితం సివిల్ సప్లయిస్ శాఖతో పాటు రెవిన్యూ, పోలీస్ శాఖలు కలిసి సంయుక్తంగా పోర్ట్ దగ్గర చెక్ పోస్ట్ లు పెట్టడంతో ఈ అక్రమ రవాణా వైజాగ్ తో పాటు ఇతర పోర్ట్ ల వైపు వెళుతుంది అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే కేశవ్ తన సమీప బంధువుల వ్యాపారానికి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించటంతో ..మిల్లర్ల బియ్యం ఎగుమతులకు అడ్డంకులు తొలగించేందుకు పోర్ట్ లో పర్యటించారా అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతోంది. కాకినాడ లో ఆయన మూడు రోజులు మకాం వేసి కీలక విషయాలపై చర్చింటానికి అది ఆయన ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లా కూడా కాదు.

                                                               మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కాకినాడ జిల్లా ఇంచార్జి మంత్రి గా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒకరు అయితే ..ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మంత్రి సన్నిహిత బంధువులే బియ్యం అక్రమ రవాణాకు కేంద్ర బిందువులుగా మారారు అన్న చర్చ సాగుతోంది. కాకినాడ పోర్ట్ లో సమస్యలు ఎదురుకావడంతో ఇతర పోర్ట్ ల నుంచి బియ్యం అక్రమ రవాణా సాగిస్తూ మిల్లరు గతంలో లాగానే పెద్ద ఎత్తున కోట్లు సంపాదిస్తున్నట్లు చెపుతున్నారు.మూడు రోజుల పాటు కేశవ్ కాకినాడ లో మకాం వేసి అది కూడా దీపం పథకానికి డుమ్మా కొట్టి మిల్లర్ల తో సమావేశం అయ్యారు అంటే ఇందులో ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది అంతా చంద్రబాబు, నారా లోకేష్ లకు  తెలిసి జరిగిందా లేక పయ్యావుల కేశవ్ పర్సనల్ ఇంటరెస్ట్ తో చేసిందా అన్న విషయం రాబోయే రోజుల్లో కానీ తేలదు. 

Tags:    

Similar News