కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు

Update: 2021-03-25 07:42 GMT

కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు కర్నూలులో జగన్ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఎన్నికల కోసమే చంద్రబాబునాయుడు పూర్తిగా రెడీ కాకపోయినా విమానాశ్రయాన్ని ప్రారంభించారని విమర్శించారు. మార్చి 28 నుంచి ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. న్యాయ రాజధానితో పలు ప్రాంతాలకు ఇక ఎయిర్ కనెక్టివిటి అందుబాటులోకి రానుందని జగన్ వ్యాఖ్యానించారు.

డీజీసీఏ నుంచి, ఇతర అనుమతులు సాధించేందుకు మంత్రితోపాటు అధికారులు ఎంతో శ్రమించారని జగన్ కొనియాడారు. ఓర్వకల్ విమానాశ్రయంలో నాలుగు విమానాలను పార్క్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు జగన్. 1008 ఎకరాల్లో 153 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. కర్నూలు నుంచి తొలి దశలో విశాఖపట్నం, చెన్నయ్, బెంగుళూరుకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News