అమరావతి సినిమాకు 'మూడవ శతదినోత్సవం'

Update: 2020-10-13 12:37 GMT

ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అమరావతి అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరును తప్పుపట్టారు. చంద్రబాబు ఈ మధ్యే అమరావతి సినిమాకు మూడవ శత దినోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. ఆయన ఎన్ని శత దినోత్సవాలు అయినా జరుపుకోవచ్చని, తాము అమరావతిని నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతం కూడా విశాఖపై లేదని విమర్శించారు. సమ్మిట్లు పెట్టడానికి, బికినీల పండుగకే మీకు విశాఖ కనిపించిందా? అని చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. అంత ప్రేమ ఉన్న చంద్రబాబు అమరావతిలో సమ్మిట్లు ఎందుకు చంద్రబాబు పెట్టలేదు అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో సీపీఐ, టీడీపీతో కలిసి ఎందుకు పోటీ చెయ్యలేదు?. చంద్రబాబుపై నమ్మకం లేకే కదా?.. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్లమంటున్నారు. వెళ్తే సీపీఐకి 100 సీట్లు ఏమైనా వస్తాయా?. చంద్రబాబు ఏమి మాట్లాడమంటే.. సీపీఐ నేతలు మాట్లాడుతున్నారు' అని మంత్రి కన్నబాబు విమర్శించారు. కన్నబాబు మంగళవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. కమిటీల నివేదిక ఆధారంగా మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Tags:    

Similar News