పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు

Update: 2020-10-02 11:25 GMT

మొన్న టీవీలు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు. కరోనా కష్ట కాల సమయంలో ప్రజలపై నిత్యం ఏదో ఒక భారం పడుతూనే ఉంది. అందునా పండగ సీజన్ వస్తున్న సమయంలో ఈ ధరల పెరుగుదల అమ్మకాలపై ఎంతో కొంత ప్రభావం చూపించటం ఖాయం అని చెబుతున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ పండగ వేళ ఆఫర్లతో ముందుకు రావటం ఖాయం. ఈ తరుణంలో కొత్తగా ఫోన్లపై పన్ను వచ్చి పడింది ఈ ప్రభావం కారణంగా యాపిల్‌, శాంసంగ్‌, షియోమి, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్‌ ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయనున్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకుంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్‌ ధరలు 2 నుంచి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Similar News