ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల కష్టాలు

Update: 2024-05-08 10:07 GMT

టాటా గ్రూప్ చేతికి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియా వరస వివాదాల్లో చిక్కుకుంటోంది. తొలుత విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనతో ఈ ఎయిర్ లైన్స్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన సంఘటనలను రిపోర్ట్ చేయనందుకు డీజీసిఐ పలుమార్లు జరిమానాలు కూడా విధించింది. కొద్ది రోజుల క్రితం టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా నెలకొల్పిన విస్తార ఎయిర్ లైన్స్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడటంతో విస్తార విమానాలు పెద్ద ఎత్తున రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విస్తార ను ఎయిర్ ఇండియా లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీనం సందర్బంగా పైలట్స్ వేతనాల్లో కోత పడటంతో పాటు ఇతర బెనిఫిట్స్ పోయే అవకాశం ఉండటంతో వాళ్ళు అందరూ సిక్ లీవ్స్ పెట్టి షాక్ ఇచ్చారు. తర్వాత ఎలాగోలా వివాదం సర్దుమణిగింది. విస్తార ఫ్లైట్స్ గాడిన పడ్డాయి. కానీ ఇప్పుడు మరో సారి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది అదే పని చేశారు.

                                   ఏకంగా మూడు వందల మంది సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టి..తమ మొబైల్స్ ను కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో దగ్గర దగ్గర 80 కి పైగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీస్ లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ పరిణామంపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు క్షమాణాలు చెప్పింది. గతంలో ఎయిర్ ఏసియా ఇండియాగా పిలిచిన ఏఐఎక్స్ కనెక్ట్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది విలీనం తాజా వివాదానికి కారణం అయినట్లు చెపుతున్నారు. సిబ్బంది అందరిని సమానంగా చూడకుండా వ్యత్యాసం చూపించటం సరికాదు అని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది వాదిస్తున్నారు. సెలవు పెట్టిన సిబ్బందితో యాజమాన్యం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వారు వారం రోజుల్లో తమ ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకోవచ్చు అని..లేక పోతే రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎయిర్ లైన్స్ చెపుతోంది.

Tags:    

Similar News