మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే

Update: 2020-09-18 09:56 GMT

బెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం మండిపడ్డారు. అయ్యన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంజ్ కారు తనదే అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనకు కుమారుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని..అలా తన కొడుకు చేతుల మీదుగా కారు కీస్ తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆ బెంజ్ కారు ఎవరి పేరు మీద ఉందో చూసుకోవచ్చన్నారు. ఏదో ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కలిశారు. కారు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగారు.తన కుమారుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని వ్యాఖ్యానించారు.

అయ్యన్న ఒకటే ఫోటో చూపించాడు..ఇంకా నాలుగైదు ఉన్నాయి. ఆ కారు ఎవరి పేరు మీద ఉంది. నా దగ్గరా ఉందా?. నా కొడుకు దగ్గర ఉందా? వాడు ముద్దాయి అని నాకు ఎలా తెలుస్తుంది?. కారు నా దగ్గర ఉండి..ఉంటే చెప్పు అని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు విడుదల చేసిన ఫోటోల్లో మంత్రి తనయుడు ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. బెంజ్ కారు పక్కన నిలబడిన ఫోటోతోపాటు నో క్యాప్షన్..ఓన్లీ యాక్షన్..లవ్ యూ ఆల్ అంటూ పోస్టు పెట్టారు.

 

Similar News