సెప్టెంబర్ 21 నుంచి షరతులతో స్కూళ్ళకు అనుమతి

Update: 2020-09-07 09:03 GMT

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 21 నుంచి 9,10వ తరగతి విద్యార్ధులు స్కూళ్లకు హాజరు అయ్యేందుకు ఏపీ సర్కారు అనుమతి మంజూరు చేసింది. అయితే దీనికి తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అన్ లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కారు జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 20 నుండి పెళ్లిల​కు 50 మంది అతిథులతో అనుమతి ఇవ్వనున్నారు. అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇస్తారు. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News