ట్రంప్ మీడియా సమావేశం..వైట్ హౌస్ ముందు కలకలం

Update: 2020-08-11 05:32 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. కానీ అంతలోనే భద్రతా అధికారి వచ్చి ట్రంప్ చెవిలో ఏదో చెప్పి ఆయన్ను అక్కడ నుంచి అకస్మాత్తుగా తీసుకెళ్ళారు. అసలేమి జరిగిందో మీడియా ప్రతినిధులకు కూడా కాసేపు అర్ధంకాలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత ట్రంప్ తిరిగొచ్చి మీడియా సమావేశం పూర్తి చేశారు. ఆయనే అసలు విషయం చెప్పేశారు. వైట్ హౌస్ ముందు ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడ్డారని. ఈ వ్యవహారం కలకలం రేపింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ గార్డ్స్ నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతను తీవ్రగాయాలు పాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయాన్ని ట్రంప్ వెల్లడిస్తూ చట్టప్రకారమే సాయుధుడైన దుండగుడిపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘వాళ్లు అత్యద్భుతమైన వ్యక్తులు. వాళ్ల సేవల పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతో భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాను’’ అని సత్వరమే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డులపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఘటనపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ప్రపంచంలోని ప్రతీ మూల ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది కదా అని సమాధానమిచ్చారు.

 

 

Similar News