షాకింగ్ లవ్ ప్రపొజల్.... మంటలు అంటించుకుని

Update: 2020-08-12 13:19 GMT

లవ్ ప్రపొజల్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో ఎవరి క్రియేటివిటి వారిది. ఆ ప్రపొజల్ చూసి పడేపోయే వాళ్ళు కూడా కొంత మంది ఉంటారు. అలాంటిదే ఈ స్టోరీ కూడా. ఎవరైనా ఈ లవ్ ప్రపొజల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ వ్యక్తి తన వెనకభాగం వైపు నిప్పు అంటించుకుని....జేబులో చేతులు పెట్టుకుని తన లవర్ కు ప్రపొజ్ చేస్తాడు. ఇది చూసిన ఆమె షాక్ కు గురి అవుతుంది. ఓ వైపు వెనక మంటలు వస్తుంటే..జేబుల్లో చేతులు ఏంటీ అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు అతగాడు సడన్ గా ఉంగరం బయటకు తీసి పెళ్ళి చేసుకుందామని అంటాడు. ఆ షాక్ లో ఆమె ‘ఎస్’ చెప్పటానికి కూడా వణికిపోయింది. కానీ చివరకు ఎస్ చెప్పేసింది కూడా. దీంతో ఈ షాకింగ్ లవ్ ప్రపొజల్ విజయవంతం అయినట్లు అయింది.

ఒంటికి నిప్పు అంటించుకుని మరీ ఈ లవ్ ప్రపొజల్ చేసిన వ్యక్తి ప్రొఫెషనల్ స్టంట్ మన్. యూకెకి చెందిన ఇతగాడి పేరు రికీ యాష్. అతని వయస్సు 52 సంవత్సరాలు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కట్రినా డాబ్సన్. .వయస్సు 48 సంవత్సరాలు. వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలో ఆన్ లైన్ లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇలా నిప్పులతో ప్రపొజ్ చేయటం కంటే మరేదీ ఆకర్షణీయంగా ఉన్నట్లు తనకు అన్పించలేదని రికీ యాష్ తెలిపాడు. ఇతను పలు వాణిజ్య ప్రకటనలు, టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో స్టంట్ మాన్ గా పనిచేశాడు. కట్రినా డాబ్సన్ ఈ కరోనా సంక్షోభ సమయంలో నర్స్ గా పనిచేస్తోంది.

 

Similar News