అంతరాష్ట్ర ప్రయాణికులకు అనుమతి అక్కర్లేదు

Update: 2020-08-22 14:07 GMT

అంతర్ రాష్ట్ర, రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళటానికి ఎలాంటి అనుమతి అక్కర్లేదని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు ఈ పర్మిట్ తోపాటు ఎలాంటి అనుమతులు అవసరం లేదని..ప్రయాణాలపై ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణల చట్టం 2005ల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఆంక్షల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. అన్ లాక్ 3లో భాగంగా అంతర్‌రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత క్రమక్రంగా కేంద్రం ఆంక్షలు సడలిస్తూ పోతున్న విషయం తెలిసిందే. అన్ లాక్ 3 కూడా ఆగస్టు 30తో ముగియనుంది. త్వరలోనే మరిన్ని ఆంక్షలు ఎత్తేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సారి థియేటర్లకు కూడా అనుమతి ఇస్తారని చెబుతున్నారు.

 

Similar News