సచివాలయ భవనాల కూల్చివేతకు ఓకే

Update: 2020-07-17 10:29 GMT

తెలంగాణ సర్కారు కు ఊరట. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేయటంతో హైకోర్టు కూడా ఓకే చెప్పేసింది. కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు కావాలంటూ పి ఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన పిల్ ను కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదన్న అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని సోలిసీటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ల్యాండ్ ప్రిపరేషన్ లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది. ఇరు వాదనలు విన్న హైకోర్టు పిటీషన్లను తోసిపుచ్చింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందని పేర్కొంది. కోవిడ్ 19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవలని సూచించింది.

Similar News