సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ కమిటీ

Update: 2020-07-20 11:04 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ ప్రభావ మదింపు కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను అందించాల్సి ఉంటుంది. హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఎన్జీటీ ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణ ప్రభావ మదింపు అంశంపైనే ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఎన్జీటీలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

‘కూల్చివేత వల్ల పర్యావరణ ప్రభావం, వ్యర్థాల నిర్వహణ పై అధ్యయనానికి కమిటీని నియమించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలకు కమిటీలో స్థానం కల్పించారు. ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు.

Similar News