జియోలోకి మరో 11,367కోట్ల పెట్టుబడులు

Update: 2020-06-18 15:10 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఫ్లాట్ ఫామ్స్ లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 11,367 కోట్ల రూపాయలు పెట్టుబడి జియోలోకి వచ్చింది. పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (పీఐఎఫ్) ఈ పెట్టుబడి పెట్టనుంది. ఇది సౌదీ అరేబియాకు చెందిన సార్వభౌమ సంస్థ. ఈ పెట్టుబడికి గాను జియో ఫ్లాట్ ఫామ్స్ లో పీఐఎఫ్ కు 2.32 శాతం వాటా దక్కనుంది. తొమ్మిది వారాల వ్యవధిలో జియోలోకి వచ్చిన పదకొండవ పెట్టుబడి ఇది. ఓ వైపు ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో రిలయన్స్ జియో ఇలా పెట్టుబడుల సాధనలో రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది.

ఇప్పటివరకూ కంపెనీ మొత్తం 1,15,693.95 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది. ఇప్పటికే ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబాదలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్టన్, పీఐఎఫ్ వంటి సంస్థలు రిలయన్స్ జియోలో వాటాలు తీసుకున్నాయి. ఈ సంస్థల పెట్టుబడి నిర్ణయాలకు జియోపై ఆయా సంస్థలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News